యుపీఐ వలన డిజిటల్ లావాదేవీలు చాలా వేగంగా జరగడం సాధ్యమైంది. కానీ, ఇదే వేగంతో మోసాలూ పెరిగిపోయాయి. ఫిషింగ్ స్కామ్‌లు, నకిలీ యుపీఐ యాప్‌లు, QR కోడ్ మోసాలు, వేషధారణ మోసాలు ఇలా చాలా రకాలుగా మోసగాళ్లు ప్రజలను మోసగిస్తున్నారు.
ముఖ్యాంశాలు:
- 2025 జనవరిలో 16.99 బిలియన్ యుపీఐ లావాదేవీలు జరిగినా, మోసాలు గణనీయంగా పెరిగాయి.
- 2023–24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ మోసాలు 300% పెరిగి 36,075 కేసులకు చేరుకున్నాయి.
- ఫిషింగ్, ఫేక్ యూపీఐ యాప్‌లు, QR కోడ్ మోసాలు, వేషధారణ మోసాలు అత్యంత సాధారణంగా జరుగుతున్నాయి.
- భద్రతా చిట్కాలు: UPI IDను ధృవీకరించండి, తెలియని లింకులపై క్లిక్ చేయవద్దు, UPI PIN ఎప్పటికీ పంచుకోవద్దు.
సాధారణ యుపీఐ మోసాలు & వాటి నుండి ఎలా తప్పుకోవాలో
1. ఫిషింగ్ స్కామ్‌లు: నకిలీ ఇమెయిల్లు, మెసేజులు, కాల్స్ ద్వారా బ్యాంకు ప్రతినిధులుగా నటిస్తూ మోసగాళ్లు UPI PIN లేదా OTP తీసుకుంటారు.
ఎలా తప్పుకోవాలి: OTP, PIN ఎవరికీ పంచుకోకండి. బ్యాంకులు/యాప్‌లు దీనిని అడగవు.
2. ఫేక్ యుపీఐ యాప్‌లు: గూగుల్ ప్లే స్టోర్ లాగా కనిపించే నకిలీ యాప్‌లు రూపొందించి యూజర్ డేటా దొంగిలిస్తారు.
ఎలా తప్పుకోవాలి: అధికారిక స్టోర్ నుంచి మాత్రమే యాప్‌లు డౌన్‌లోడ్ చేయండి. రివ్యూలు చదవండి.
3. QR కోడ్ స్కామ్‌లు: స్కాన్ చేస్తే డబ్బు వస్తుందని చెబుతూ QR కోడ్‌లు పంపించి, వాస్తవానికి డబ్బు తీసేస్తారు.
ఎలా తప్పుకోవాలి: QR కోడ్‌లు పేమెంట్లకే. డబ్బు రిసీవ్‌కి కావు. తెలియని QR కోడ్ స్కాన్ చేయవద్దు.
4. మనీ రిక్వెస్ట్ స్కామ్‌లు: రిఫండ్, సెలరీ, గిఫ్ట్‌ల పేరిట ఫేక్ రిక్వెస్ట్‌లతో PIN ఎంటర్ చేయిస్తారు.
ఎలా తప్పుకోవాలి: రిక్వెస్ట్ నిజమా కాదా నిర్ధారించుకోండి. డబ్బు రిసీవ్‌కి PIN అవసరం లేదు.
5. లాటరీ/రివార్డ్ స్కామ్‌లు: లాటరీ గెలిచారని చెప్పి UPI వివరాలు అడిగి డబ్బు దోచుకుంటారు.
ఎలా తప్పుకోవాలి: అదిరిపోయే ఆఫర్లు నిజమయ్యే అవకాశాలు తక్కువ. ధృవీకరించకుండా UPI డిటెయిల్స్ ఇవ్వవద్దు.
6. ఫేక్ పేమెంట్ స్క్రీన్‌షాట్లు: నకిలీ UPI పేమెంట్ స్క్రీన్‌షాట్‌లతో షాపుల్లో, సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర మోసం చేస్తారు.
ఎలా తప్పుకోవాలి: బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా యాప్‌లో పేమెంట్ వాలిడేట్ చేయండి.
7. ఫేక్ UPI IDలు: ఉదా: @ptys ను @ptyesలా మార్చి మోసం చేస్తారు.
ఎలా తప్పుకోవాలి: యుపీఐ IDను రెండుసార్లు ధృవీకరించండి. ఫ్రీక్వెంట్ IDలని సేవ్ చేసుకోండి.
8. నకిలీ సేలర్లుగా నటించటం: ఆన్‌లైన్‌లో ఉత్పత్తులు అమ్ముతున్నట్లు నటించి అడ్వాన్స్ పేమెంట్ తీసుకుని మాయమవుతారు.
ఎలా తప్పుకోవాలి: వెరిఫైడ్ సేలర్ల దగ్గర మాత్రమే కొనుగోలు చేయండి.
9. స్క్రీన్ మిర్రరింగ్ యాప్‌ల ద్వారా యాక్సెస్: AnyDesk, TeamViewer లాంటి యాప్‌లు ఇన్‌స్టాల్ చేయమంటూ, ఫోన్‌ను యాక్సెస్ చేస్తారు.
ఎలా తప్పుకోవాలి: ఎవరైనా అడిగినప్పటికీ, అపరిచిత యాప్‌లు ఇన్‌స్టాల్ చేయవద్దు.
యుపీఐ మోసాల నుండి సురక్షితంగా ఉండాలంటే:
- యుపీఐ యాప్‌లకు లాక్ పెట్టండి (ఫింగర్‌ప్రింట్ లేదా PIN తో)
- UPI IDలు & సేలర్ వివరాలు క్రాస్ చెక్ చేయండి
- తెలియని లింకులపై క్లిక్ చేయవద్దు
- మీ UPI PIN ఎప్పుడూ పంచుకోకండి
- తప్పు లావాదేవీలు జరిగితే వెంటనే 1930 కైబర్‌హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి
 
                     
                     
							